Thursday, March 19, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్బొబ్బిలి వీణపై పోస్టల్ స్టాంప్

బొబ్బిలి వీణపై పోస్టల్ స్టాంప్

భారత ప్రభుత్వ ఐటి, కమ్యూనికేషన్స్ శాఖ అధ్వర్యంలో తపాలా శాఖ  బొబ్బిలి వీణపై ప్రత్యేక పోస్టల్ స్టాంప్  విడుదల చేసింది.  బొబ్బిలి పట్టణంలో గల సూర్య రెసిడెన్సీలో తపాలా శాఖ అధ్వర్యంలో నివహించిన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించారు.

విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినవెంకట లనాయుడుతో పాటు రాష్ట్ర తపాలా జనరల్ మేనేజర్ ఎమ్. వెంకటేశ్వరరావు గారు, రోటరీ క్లబ్ అధ్యక్షులు తూముల నాగ సుధీర్, తపాలా శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular