Saturday, November 23, 2024
HomeTrending Newsజులైలో పరీక్షలు: ఆదిమూలపు

జులైలో పరీక్షలు: ఆదిమూలపు

జూలై నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామని రాష్ర్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ విషయమై గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

జూలై మొదటి వారం నుంచి ఇంటర్, నెలాఖరులో టెన్త్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని మంత్రి సురేష్ సూత్రప్రాయంగా వెల్లడించారు. విద్యార్ధుల ఆరోగ్యం, భవిష్యత్ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని, రోజువారీ కేసులు గణనీయంగా తగ్గిపోయాయని ఈ పరిస్థితుల్లో విద్యార్ధుల భవిష్యత్ దృష్ట్యా, వారి ప్రయోజనం కోసం పరీక్షలు నిర్వహించేందుకే ముందడుగు వేస్తున్నామని సురేష్ వివరించారు.

1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. 36 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు 10లక్షల మంది
ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాలి. ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ ఉంది. ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు. వచ్చే నెల ఇంటర్‌ పరీక్షలు పూర్తయితే ఆగస్టులో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ, ఇతర ఉమ్మడి పోటీ పరీక్షలు ఉంటాయి. సెప్టెంబరులో తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్