Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఏపి రైతాంగాన్ని కాపాడండి

ఏపి రైతాంగాన్ని కాపాడండి

కృష్ణానదిపై తెలంగాణా ప్రభుత్వం 255 టిఎంసిల సామర్ధ్యంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతోందని, ఇవి పూర్తయితే కృష్ణా డెల్టా సహా ఆంధ్రప్రదేశ్ భూములు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని ఆంధ్ర ప్రదేశ్ సాగునీటి సంఘాల అధ్యక్షుడు ఆళ్ళ గోపాల కృష్ణ చెప్పారు. తెలంగాణ చర్యలతో కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ తో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు నీటి సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు.  తెలంగాణాతో జలవివాదంతో ఆంధ్రప్రదేశ్ రైతులు నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు. తెలంగాణా ప్రాజెక్టులు కొత్తవే అని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందని, ఈ విషయమై రాబోయే కేఆర్ఏంబి సమావేశంలో చర్చించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్