Friday, January 24, 2025
HomeTrending News2 లక్షల 29 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్

2 లక్షల 29 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. కోవిడ్ పై పోరాటానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. వెనుకబడిన కులాలకు 32 శాతం అదనంగా కేటాయిపులు చేశారు.

గత ఏడాది బడ్జెట్ అంచనా రూ. 2,24,789 కోట్లు కాగా ఈ ఏడాది రూ. 2,29,779.27 కోట్లతో బడ్జెట్ అంచనాలు ప్రవేశ పెట్టారు. రెవిన్యూ వ్యయం రూ. 1,82,196 కోట్లు కాగా, మూల ధన వ్యయం రూ. 47,582 కోట్లు, రెవిన్యూ లోటు రూ. 5 వేల కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ. 37,029 వేల కోట్లు

వివిధ రంగాలకు కేటాయింపులు ఈ విధంగా వున్నాయి

వెనుకబడిన కులాల సంక్షేమం – రూ. 28,237 కోట్లు
ఈబిసి సంక్షేమం – రూ. 5,478 కోట్లు
కాపు సంక్షేమం – రూ.3,306 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ – రూ. 17,403 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్ – రూ. 6,131 కోట్లు
మైనార్టీ సబ్ ప్లాన్ – రూ. 1756 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమం- రూ. 359 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్ – రూ. 3840 కోట్లు
మహిళా సంక్షేమం- రూ. 47,283 కోట్లు
చిన్నారుల సంక్షేమం – రూ. 16,748 కోట్లు
వ్యవసాయ పదాకాలు – రూ. 11,210 కోట్లు
విద్యా రంగానికి – రూ. 24,624 కోట్లు
వైద్యం, ఆరోగ్యం – రూ.13,830 కోట్లు
జగనన్న విద్యా దీవెన – రూ. 2,500 కోట్లు
జగనన్న వసతి దీవెన – రూ. 2,223 కోట్లు
విద్యుత్ రంగానికి – 6,637 కోట్లు
రోడ్లు, భవనాలు – రూ. 7,594 కోట్లు
వైఎస్సార్ పిఎం ఫసల్ భీమా యోజన – రూ. 1.802 కోట్లు
డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలకు – రూ. 865 కోట్లు
పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళల కోసం – రూ. 247 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపులు – రూ.500 కోట్లు
వైఎస్సార్ కాపు నేస్తం – రూ.500 కోట్లు
వైఎస్సార్ జగనన్న తోడు – రూ. 300 కోట్లు
వైఎస్సార్ వాహన మిత్ర – రూ.285 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక – రూ. 17వేల కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా – రూ. 3,845 కోట్లు
నీటిపారుదల – రూ. 13.237 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి – రూ. 8,727 కోట్లు
అమ్మ ఒడి – రూ. 6,107 కోట్లు
విద్యారంగం నాడు –నేడు – రూ. 3.500 కోట్లు
జగనన్న గోరు ముద్ద – రూ.1,200 కోట్లు
ఉన్నత విద్య కోసం – రూ. 1,973 కోట్లు
జగనన్న విద్యా కానుక – రూ.750 కోట్లు
వైఎస్సార్ ఆసరా – రూ. 6,337 కోట్లు
వైఎస్సార్ చేయూత – రూ. 4,445 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా- రూ. 120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ – రూ. 50 కోట్లు
అగ్రిగోల్ద్ బాధితులకు చెల్లింపులు – రూ.200 కోట్లు
రైతులకు ఎక్స్ గ్రేషియా – రూ.20 కోట్లు
రైతుల పథకాలకు – రూ. 11,210.80 కోట్లు
వైఎస్సార్ టెస్టింగ్ లాబ్ లకు – రూ. 88.57 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంటల భీమ పథకం – రూ. 1802.82 కోట్లు
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ కోసం – రూ. 739.46 కోట్లు
ఆస్పత్రుల్లో నాడు – నేడు – రూ. 1,535 కోట్లు
ఆరోగ్యశ్రీ మందుల కొనుగోలు – రూ. 2,248 కోట్లు
ఏపివివిపి ఆస్పత్రుల్లో శానిటేషన్ – రూ.100 కోట్లు
హౌసింగ్, మౌలిక వసతులు – రూ. 5,661 కోట్లు
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు – రూ. 1,000 కోట్లు
లా నేస్తం – రూ.16.64 కోట్లు
వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ – రూ. 200 కోట్లు
కడప స్టీల్ ప్లాంట్ – రూ. 250 కోట్లు
ఏపిఐఐసి – రూ. 200 కోట్లు
పారశ్రామిక, మౌలిక సదుపాయాలు – రూ. 3673 కోట్లు
దిశ అమలు – రూ. 33.75 కోట్లు
అంగన్ వాడిల్లో నాడు-నేడు – రూ. 278 కోట్లు
వైఎస్సార్ భీమా – రూ. 372.12 కోట్లు
అర్చకులకు – రూ. 120 కోట్లు
పాస్టర్లకు – రూ. 40 కోట్లు
ఇమ్మం, మౌజాం లకు – రూ. 80 కోట్లు
భూ సర్వే – రూ. 206.97 కోట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్