Saturday, November 23, 2024
HomeTrending Newsమన సమస్య మాత్రమే కాదు: బుగ్గన

మన సమస్య మాత్రమే కాదు: బుగ్గన

కరోనా కారణంగా రాష్ట్ర రాబడి తగ్గిపోయిందని, ఈ సమస్య ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినది మాత్రమే కాదని, అన్ని రాష్ట్రాలూ చివరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పడిపోయిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్ర నాథ్ వెల్లడించారు.  రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై  చర్చించేందుకే ఢిల్లీ పర్యటనకు వస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం తగదని విపక్షాలకు హితవు పలికారు. ప్రతిపక్షాలు తెలిసీ తెలియక మాట్లాడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో బుగ్గన సమావేశ మయ్యారు.

లాక్ డౌన్ తో పేదలు ఉపాధి కోల్పోయారని, వారు బతకాలంటే ప్రభుత్వాలు ఆడుకోవాల్సి ఉంటుందని, వారిపై ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని బుగ్గన స్పష్టం చేశారు. రాష్టానికి సంబంధించిన పలు అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై కేంద్ర మంత్రితో చర్చించామని బుగ్గన వెల్లడించారు.  కరోనాకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, ఈ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.

కేంద్రం పౌరసరఫరాల శాఖ జాతీయ ఆహార భద్రతా కార్డులకు బియ్యం, పప్పు ఇస్తుందని, దీనితో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులకు కూడా ఇవి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్ధిక శాఖ, నీతి అయోగ్, పౌర సరఫరాలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్ అంశాలపై ఫాలో-అప్ చేసేందుకు ఇక్కడకు వచ్చానన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్