Saturday, January 18, 2025
HomeTrending Newsసామర్ధ్య - సంపన్న ఆంధ్ర - బుగ్గన ఓటాన్ అకౌంట్

సామర్ధ్య – సంపన్న ఆంధ్ర – బుగ్గన ఓటాన్ అకౌంట్

పేదరికంపై యుద్ధం తమ విధానం అయితే దోమలపై దండయాత్ర అన్నది గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి విధానమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.  వచ్చే ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను బుగ్గన నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

57 నెలల పాలనలో తమ ప్రభుత్వం అవలంభించిన విధానాలు, సాధించిన ప్రగతిని ఏడు భాగాలుగా విభజించవచ్చని బుగ్గన చెప్పారు.

  1. సుపరిపాలన ఆంధ్ర
  2. సామర్ధ్య ఆంధ్ర
  3. మన మహిళ- మహారాణుల ఆంధ్ర
  4. అన్నపూర్ణ ఆంధ్ర
  5. సంక్షేమ ఆంధ్ర
  6. సంపన్న ఆంధ్ర
  7. భూ భద్ర ఆంధ్ర

బడ్జెట్ ప్రతిపాదనలు 

  • రూ. 2,86,389.27 కోట్లతో ఏపీ బడ్జెట్
  • ఆదాయ వ్యయం 2,30,110.41 కోట్లు
  • మూలధన వ్యయం 30,530.18 కోట్లు
  • రెవిన్యూ లోటు 24,758.22 కోట్లు
  • ద్రవ్య లోటు 55,817.50 కోట్లు
  • జీఎస్దీపీలో ద్రవ్య లోటు 3.51 శాతం
  • జీఎస్దీపీలో రెవిన్యూ లోటు 1.56  శాతం

బడ్జెట్ ముఖ్యాంశాలు:

  • 1000 స్కూళ్ళల్లో CBSE సిలబస్ అమల్లోకి తీసుకువచ్చాం
  • విద్యా ప్రమాణాల మెరుగు కోసం 9,52,927ట్యాబులు అందించాం
  • 3367 కోట్ల రూపాయలతో ఏటా 47 లక్షల మంది విద్యార్ధులకు స్కూల్ కిట్లు
  • జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.11,9౦1 కోట్ల వ్యయం
  • జగనన్న వసతి దీవెన కింద రూ. 4276 కోట్లు
  • 99.81 శాతం స్కూళ్ళలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాం
  • జగనన్న గోరు ముద్ద పథకానికి ఏటా రూ. 1910కోట్లు
  • విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 52 లక్షల మందికి లబ్ధి
  • విదేశీ విద్యా దీవన కింద 1858మందికి లబ్ధి
  • 43.16 లక్షల మందికి అమ్మ ఒడి కింద రూ. 26,067 కోట్లు ఖర్చు
  • రైతులకోసం 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
  • ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.1277 కోట్లు అందించాం
  • సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా రూ.1835 కోట్లు
  • రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేసిన రాష్ట్రం మనదే
  • ఉచిత పంటల బీమా కింద రూ. 3411 కోట్లు అందించాం
  • వైఎస్సార్ చేయూత కింద రూ. 14,219 కోట్లు
  • రైతు భరోసా పిఎం-కిసాన్ కింద రూ. 33,౩౦౦ కోట్లు
  • జగనన్న పాల వెల్లువ కింద రూ.2697 కోట్లు
  • రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 37, 374 కోట్లు
  • 19 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 9 గంటల ఉచిత విద్యుత్
  • 73.88 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీకే రుణాలు
  • రైతు భరోసా కింద 1.6 లక్షల మంది కౌలు రైతులకు లబ్ధి
  • రూ. 10,137 కోట్లతో 9 తాగునీటి పథకాలు
  • ఐదేళ్ళలో రూ.2,626 కోట్లర్హో రాష్ట్ర రహదారుల అభివృద్ధి
  • రూ. 20 వేల కోట్లతో నాలుగు పర్యావరణ ఓడరేవులు
  • రూ. 3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు
  • 1 లక్షా 53 వేల కోట్ల రూపాయల ఖర్చుతో 30, 65, 315 మందికి ఇల్లపట్టాల పంపిణీ
  • వాహన మిత్ర కింద 2 లక్షల78వేల మందికి రూ. 1305 కోట్ల సాయం
  • లా నేస్తం కింద 6069మంది న్యాయవాదులకు నెలకు రూ. 5 వేలు
  • 2019నుంచి 66.35 లక్షల మందికి రూ.84,731 కోట్లు ఖర్చు
  • ఐదేళ్ళలో 4 లక్షల 93 వేల మందికి ఉద్యోగాల
  • ఇందులో 2,13, 662 మందికి శాశ్వత ఉద్యోగాలు
  • గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ద్వారా 13.11 లక్షల కోట్ల ఒప్పందాలు
  • 386 ఒప్పందాలు, 6.7 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
  • 311 పైగా భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటు, వీటి ద్వారా 1.30 లక్షల మందికి ఉద్యోగాలు
  • సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ద్వారా 5,995 కోట్ల పెట్టుబడివ్యవసాయరంగ సమ్మిలిత వారధిక
  • వృద్ధి రేటులో 12 నుంచి 6వ స్టానానికి
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటులో 14 నుంచి 4 వ స్థానానికి చేరుకున్నాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్