Saturday, January 18, 2025
HomeTrending Newsటిటిడికి స్పెసిఫైడ్ అథారిటీ

టిటిడికి స్పెసిఫైడ్ అథారిటీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వై వీ సుబ్బారెడ్డి ఛైర్మన్ గా ఉన్న ప్రస్తుత పాలక మండలి పదవీకాలం జూన్ 21తో ముగిసింది.

దీనితో ఈవో చైర్మన్ గా, ఏఈవో కన్వీనర్ గా స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పాలకమండలికి ఉన్న అన్ని అధికారాలూ ఈ స్పెసిఫైడ్ అథారిటీ కి ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  వచ్చే నెల మొదటి వారానికి కొత్త పాలకమండలి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

సుబ్బారెడ్డి కి మరోసారి ఛైర్మన్ పదవి దక్క వచ్చని తెలుస్తోంది. అయితే ఈసారి కొత్తవారికి అవకాశం ఇస్తారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. మాజీ ఎంపి మేకపారి రాజమోహన్ రెడ్డి పేరును సీఎం  జగన్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో తన ఎంపీ సీటును ఆదాల ప్రభాకర్ రెడ్డికి త్యాగం చేసినందుకు ప్రతిగా ఆయనకు ఈ పదవి ఇస్తానని గతంలోనే జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్