Sunday, January 19, 2025
HomeTrending Newsబాబు టూర్ వృధా ప్రయాస: శ్రీకాంత్ రెడ్డి

బాబు టూర్ వృధా ప్రయాస: శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడడం అనవసరమని ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మోడీ, అమిత్ షా ప్రాపకం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఏదో రకంగా ప్రచారం కావాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బద్వేల్ లో శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతారు తప్ప ఈ పర్యటనతో ఒరిగేదేమీ ఉండదన్నారు.

బద్వేల్ లో డిపాజిట్లు రావని తెలిసే బిజెపి నేతలు వైఎస్సర్సీపీపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఉనికి కోసమే బిజెపి నేతలు పాకులాడుతున్నారని, వారికి ఓట్లు రావని తెలిసే సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని, కానీ బిజెపి తాము కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న గర్వంతో ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు మాత్రమే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పై బురదజల్లేందుకే ఆరోపణలు చేస్తున్నారన్నారు.

శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు:

⦿ బిజెపి నేతలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి ఉంది
⦿ సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తాం
⦿ ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది
⦿ సోమశిల విషయంలో పెండింగ్ లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి ఒన్ టైం సెటిల్ మెంట్
⦿ ప్రభుత్వం అర్హులైన వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తుంది
⦿ బీజేపీ నేతలు మందిమార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు
⦿ మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదు
⦿ ప్యారా మిలిటరీ  బలగాలు మొహరిపజేసి హడావుడి చేయాలనే ప్రయత్నం
⦿ మొత్తం ఆర్మీ బలగాలు దించినా అభ్యంతరం లేదు, మాకు ప్రజాబలం ఉంది
⦿ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం
⦿ మీకు ప్రజాబలం లేదనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు
⦿ ఎన్నికల కమిషన్ ను మేము కూడా అడుగుతున్నాం
⦿ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుతున్నాం
⦿ కాంగ్రెస్ , బీజేపీ కలయికతోనే రాష్ట్రం విభజన జరిగింది
⦿ మాకు రాజకీయ ప్రయోజనాల కంటేరాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
⦿ విభజన చట్టంలో హామీలు నేరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటాం
⦿ చట్టంలో ఉన్న హామీలనే అడుగుతున్నాం
⦿ ప్రత్యేక హోదా, దుగరాజపట్నం, స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటాం
⦿ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేస్తాం
⦿ పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు ఎందుకు పెంచుతున్నారు? ఎందుకు మాట్లాడడం లేదు?
⦿ వ్యక్తిగతంగా దూషణలు, ఆరోపణలు చేయడం సంస్కారం కాదు
⦿ ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పారు
⦿ ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు కేవలం కేంద్రంలో పదవి కోసమే
⦿ రాజకీయ ప్రజనాల కోసం  రాజకీయ భిక్ష పెట్టినవారిపై ఆరోపణలు
⦿ స్వప్రయోజనాల కోసం సంస్కారం మరిచిపోవద్దు
⦿ డిపాజిట్లు రావని తెలిసి ప్రచారం వదిలేసి అసత్య ఆరోపణలు
⦿ ఉనికి కాపాడుకోవడం కోసం ఆరాట పడుతున్నారు
⦿ ప్రజల్లోకి తిరిగి ఓట్లు అడగండి… ప్రెస్ మీట్ లకు పరిమితమై ఆరోపణలు చేయడం మానుకోండి

RELATED ARTICLES

Most Popular

న్యూస్