ఏదీ
నాటి కళేదీ..
నాటి కాంతేదీ..
నాటి సంబరమేదీ..
నాటి సందడేది..
డాష్ బోర్డు లేవి?..
వీడియో కాన్ఫరెన్స్ లేవి?..
కలెక్టర్లకు, డాక్టర్లకు తీసుకున్న క్లాసులేవి?
ఏదీ..
నాటి హడావిడేది.?
నాటి హంగామా ఏది.?
వాడవాడలా పచ్చతోరణాలేవి?
చిత్రవిచిత్రమైన పేర్లతో దీక్షలేవి?
నిరంతర ప్రత్యక్ష ప్రసారాలేవి?
ఆనందంతో పరవశించిపోతున్న ప్రజల దృశ్యాలేవి..?
ఏవీ?
మాస్కులు , మందుల మీద పాఠాలేవి?
వ్యాక్సిన్లు..వైరస్లు ఎలా కనిపెట్టాలో చెప్పే ప్రసంగాలేవి?
డ్వాక్రా మహిళలు, ఆశావర్కర్లను పోగేసి సభలేవి?
స్కూలు పిల్లలను జమచేసి జరిపే ర్యాలీలేవి..?
బిల్ గేట్స్ ని బిల్ క్లింటన్ ని గుర్తు చేసేవాళ్లేరి?
న్యూయార్క్ వీధుల్లో నడిచిన అనుభవాలు చెప్పేవాళ్లేరి?
ఏదీ..
తొలి వ్యాక్సీన్ వేసి గర్వంగా కెమెరాకు ఇచ్చిన పోజులేవి..
ఆ చేతుల మీద వ్యాక్సిన తీసుకుని ఉప్పొంగిపోయిన అనుభవాలేవి?
సాయంత్రానికి ముగింపు వేడుకలేవి?
మళ్ళీ మరో గంట ఉపన్యాసాలేవి..
జనం వేనోళ్ల ప్రశంసలేవీ..
విజయోత్సవ సందోహాలేవీ…
ఓకే ఒక రోజులో పదిలక్షల మందికి వ్యాక్సిన్లు వేయించడం ఇలాగేనా..?
దేశంలో అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ చేయడం ఇంత నిశ్శబ్దంగానా..?
జగను ఎప్పుడు నేర్చుకుంటాడో…ఏమో?
అదే ఆయన అయ్యుంటే…
-కె. శివప్రసాద్