Thursday, November 21, 2024
HomeTrending News6 లక్షల మందికి శాశ్వత ఉపాధి

6 లక్షల మందికి శాశ్వత ఉపాధి

రాష్ట్రంలో మహిళా ఆర్థిక స్వావలంభన దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించనుంది. దీనికి గాను 14 ప్రముఖ సంస్థలతో వ్యాపార ఒప్పందాలు చేసుకుంది. మంత్రుల కమిటీ సమక్షంలో ఎంఓయులపై సంతకాలు అధికారులు సంతకాలు చేయనున్నారు.  ఈ ఏడాది వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పధకాల ద్వారా మహిళలకు 11 కోట్ల రూపాయలు  లబ్ధి చేకూర్చింది ప్రభుత్వం. ఈ సొమ్ముని వ్యాపార, స్థిర ఆదాయ మార్గాల్లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా మహిళలకు శాశ్వత ఉపాధి లభిస్తోంది. దీని ద్వారా  ఏడాది 3 లక్షల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధి పొందారు.

గత రెండేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా మహిళాభ్యుదయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని  రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్