Sunday, September 8, 2024
HomeTrending Newsఆనందయ్య మందుకు ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

ఆనందయ్య మందుకు ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైకోర్టు కూడా మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కంటిలో వేసే మందుపై గురువారం లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ గురువారం నాటికి వాయిదా వేసింది.

అంతకుముందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆనందయ్య తయారు చేస్తున్న పి,ఎల్, ఎఫ్ మందులకు అనుమతించింది. కేంద్ర అయుష్ శాఖ, సిసిఆర్ఏఎస్ అందించిన నివేదిక మేరకు మందు పంపిణీకి అభ్యంతరం లేదని పేర్కొంది. మందులో హానికర రసాయనాలు ఏవీ వాడలేదని నిర్ధారణ అయినందున పంపిణీకి అభ్యంతరం లేదని తెలిపింది.

కానీ కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఇంకా సమగ్ర నివేదికలు రావాల్సి ఉందని పేర్కొంది. ఈ నివేదిక రావడానికి మరో 2,3 వారాలు సమయ పడుతుందని, అది వచ్చాకే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.

మందు పంపిణీలో కోవిడ్ నిబంధనలు పాటించాలని, మందు కోసం కోవిడ్ బాధితుల బంధువులు మాత్రమె రావాలని, బాధితులు నేరుగా మందుకోసం రావొద్దని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆనందయ్య మందు కోవిడ్ తగ్గిస్తుందని పూర్తిగా నిర్ధారణ కాలేదని, అందుకే ఈ మందు వాడాలనుకున్న వారు ఇతర మందులు వాడడం అపవద్దని ప్రభుత్వం సూచించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్