రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జిఓ జారీ చేసింది. 103వ రాజ్యంగ సవరణ ద్వారా కేంద్రప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చట్టాన్ని పలు రాష్ట్రాల్లో అమలు చేస్తుండగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
- అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు
- విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్తింపు
- కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసిన వైయస్.జగన్ ప్రభుత్వం
- నిబంధనల సరళతరంతో ఎక్కువమంది అగ్రవర్ణ పేదలకు మేలు
- కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తింపు
- మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయపరిమితి పెంచిన ప్రభుత్వం
- రూ.6లక్షల నుంచి రూ. 8లక్షలకు పెంచిన ప్రభుత్వం
- గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా మెమో జారీ
- రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలకు మెమోద్వారా అధికారిక సమాచారం
- రూ.8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు