Saturday, September 21, 2024
Homeసినిమాఎట్టకేలకు టికెట్ జీవో!

ఎట్టకేలకు టికెట్ జీవో!

At last GO out: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీవో నంబర్ 35 ప్రకారమే టికెట్ రేట్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించడం తెలుగు సినీ పరిశ్రమకు శరాఘాతంగా పరిణమించింది.  ఈ విషయమై సినీ ప్రముఖులు పలుమార్లు సిఎం జగన్ కు విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఏపీ సిఎం జగన్ తో తొలుత ఒక్కరే భేటీ కావడం, ఆ తర్వాత ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి లాంటి వారితో కలిసి భేటీ కావడం తెలిసిందే. టికెట్ రేట్లపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ సిఫారులను అమలు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 13ను నేడు విడుదల చేసింది.

జీవో ప్రకారం సవరించిన సినిమా టికెట్ రెట్లు ఈ విధంగా ఉన్నాయి.

మున్సిపల్‌ కార్పొరేషన్లు:
నాన్‌ ఏసీ…. నాన్‌ ప్రీమియం-రూ.40; ప్రీమియం రూ. 60
ఏసీ….. నాన్‌ ప్రీమియం-రూ.70; ప్రీమియం రూ.100
స్పెషల్‌ థియేటర్లు… నాన్‌ ప్రీమియం-రూ.100; ప్రీమియం రూ. 125
మల్టీప్లెక్సులు… రెగ్యులర్ – రూ.150;  రిక్లైనర్ -రూ.250

మున్సిపాలిటీలు:
నాన్‌ ఏసీ…. నాన్‌ ప్రీమియం-రూ.30; ప్రీమియం రూ.50
ఏసీ….. నాన్‌ ప్రీమియం-రూ.60; ప్రీమియం రూ.80
స్పెషల్‌ థియేటర్లు… నాన్‌ ప్రీమియం-రూ.80; ప్రీమియం రూ.100
మల్టీప్లెక్సులు… రెగ్యులర్ – రూ.125;  రిక్లైనర్ -రూ.250

నగర పంచాయతీలు- పంచాయతీలు:
నాన్‌ ఏసీ…. నాన్‌ ప్రీమియం-రూ.20;  ప్రీమియం రూ.40
ఏసీ….. నాన్‌ ప్రీమియం-రూ.50; ప్రీమియం రూ.70
స్పెషల్‌ థియేటర్లు… నాన్‌ ప్రీమియం-రూ.70; ప్రీమియం రూ.90
మల్టీప్లెక్సులు… రెగ్యులర్ – రూ.100;  రిక్లైనర్ -రూ.250

ఈ రేట్లకు జీఎస్టీ అదనం కాగా… థియేటర్ల నిర్వాహణనుకు ఏసీ థియేటర్లకు రూ.5; నాన్-ఏసీ థియేటర్లకు రూ.3 కలిపి ధర నిర్ణయించారు. ప్రతి థియేటర్లో 25శాతం సీట్లు నాన్ ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది.

హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్ల రూపాయల పైబడి వ్యయం చేసిన సినిమాలకు కనీసం 10 రోజులపాటు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్