Friday, November 22, 2024
Homeసినిమాఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్

ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్

GO for RRR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘. ఎప్పుడెప్పుడు విడుదల‌వుతుందా అని ఎంతో ఆతృత‌గా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 25న భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. అయితే.. ఏపీలో టిక్కెట్ల రేట్లు పెంచుతూ కొత్త జీవో వ‌చ్చింది. అయితే.. అందులో ఏపీలో 20 శాతం షూటింగ్ చేసిన చిత్రాల‌కే టిక్కెట్ల రేట్లు పెంచుకునే అవ‌కాశం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పుడున్న రేట్ల‌తో రిలీజ్ చేస్తే.. న‌ష్టాలు త‌ప్ప‌వు. అందుక‌నే ఈ విష‌యం గురించి మాట్లాడేందుకు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత డీవీవీ దాన‌య్య ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ను ప్ర‌త్యేకంగా క‌లిసి టిక్కెట్ల రేట్లు గురిచి చ‌ర్చించారు. దీనికి సీఎం జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు. ఆర్ఆర్ఆర్ భారీ బ‌డ్జెట్ తో రూపొందించిన సినిమా కావ‌డంతో 100 రూపాయ‌లు అద‌నంగా టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అలాగే.. 5 షోలు వేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింద‌ని.. అలాగే తెలంగాణ‌లో కూడా 5 షోలకు ప‌ర్మిష‌న్ ఇచ్చింద‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెలియ‌చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్