Wednesday, March 18, 2026
HomeTrending Newsసుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం : సురేష్

సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం : సురేష్

పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను శిరసావహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏపీ, కేరళ రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని, పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది స్పష్టంగా తెలియజేశామని సురేష్ వివరించారు. గదికి 15 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు నివేదించామని చెప్పారు.

విద్యార్థికి, విద్యార్థికీ మధ్య ఐదడుగుల భౌతికదూరం పాటిస్తూ కోవిడ్ ప్రోటోకాల్‌లను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని న్యాయస్థానానికి తెలిపామని, ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ పరీక్షలను ఎలా పరిగణనలోకి తీసుకుంటామో కోర్టుకు వివరించామని చెప్పారు. పదో తరగతిలో గ్రేడ్‌ల విషయంపైనా కోర్టుకు వివరాలను వెల్లడించామని పేర్కొన్నారు.

కేవలం గ్రేడ్‌లు మాత్రమే ఇస్తున్నామని, మార్కులు కాదని సుప్రీంకోర్టుకు తెలిపామని, ఈ వివరాలన్నింటిని అఫిడవిట్ ద్వారా తెలపాలని కోరుతూ.. విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది తప్ప ఎలాంటి హెచ్చరికలూ జారీ చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటించినా దాన్ని పాటిస్తామని సురేష్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular