నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి 10 వేల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాన్ని అందించే జగనన్న తోడు కార్యక్రమాన్ని నేడు ప్రభుత్వం అమలు చేయనుంది.
పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేల చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించనుంది. దీనితో పాటు, గత ఆరు నెలలకు సంబంధించిన రూ. 15.96 కోట్ల వడ్డీ రీఇంబర్స్ మెంట్‌ను నేడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.
ఈ పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ. 395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,03,558 లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,011 కోట్లు
- ఇప్పటివరకు మొత్తం లబ్ధిదారులు 15,03,558 మంది
- సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం పొందినవారు 5,07,533 మంది
- వీరికి బ్యాంకుల ద్వారా అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,011 కోట్లు
- సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల మందికి ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ. 48.48 కోట్లు.