Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించైనా సమీక్ష సందర్భంగా కర్ఫ్యూ పై నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో అందరూ కచ్చితంగా మాస్కులు ధరించేలా చూడాలని సిఎం ఆదేశించారు, మాస్క్ లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలని సూచించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్ డోర్స్ లో 100 మంది మించకుండా చూడాలన్నారు.
మాస్కు తప్పనిసరి చేశారు, సినిమా థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీతో అనుమతిస్తారు, దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేయనుంది
Also Read : మధురై, అరుణాచలంలో పూర్తిగా లాక్‌డౌన్