Tuesday, January 21, 2025
HomeTrending Newsవచ్చే ఏడాదినుంచి ఐబి బోధన ప్రారంభం

వచ్చే ఏడాదినుంచి ఐబి బోధన ప్రారంభం

ఫ్యూచర్‌ స్కిల్స్‌ అంశాన్ని పాఠ్యప్రణాళికలో పొందుపరిచే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఫైనాన్షియల్‌ లిటరసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, దీనివల్ల ఆర్థిక వ్యవహారాలపై వారికి ఓ అవగాహన ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.  విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.  విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. ఐబీ విద్యాబోధనపై కూడా సిఎం సమీక్షించారు.

సమీక్షలో ముఖ్యాంశాలు: 

  • జనవరి 31న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఐబీ ప్రతినిధులు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బోధనపై శిక్షణ కార్యక్రమాలు
  • విద్యాశాఖలో టీచర్ల సహా సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇవ్వనున్న ఐబీ ప్రతినిధులు.
    టీచర్లు, ఎంఈఓలు, డీఈఓలు సహా సిబ్బంది అందరికీ శిక్షణ.
  • 2025–26 విద్యాసంవత్సరం నుంచి ఐబీ విద్యాబోధన ఒకటో తరగతితో ప్రారంభం.
    జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వనున్న ఐబీ.
  • ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌లో ముందడగుపై సీఎం సమీక్ష.
  • ప్రతి మూడు పాఠశాలలకు ప్యూచర్‌ స్కిల్స్‌పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
  • ఇప్పటికే 2066 మంది ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్‌లను వివిధ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో గుర్తించామని, వారికి గౌరవవేతనం కూడా చెల్లిస్తున్నామని తెలిపిన అధికారులు.
  • 8వ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఫ్యూచర్‌ స్కిల్స్‌ బోధించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే ఒక సెమిస్టర్‌కు సంబంధించి సిలబస్‌ రూపొందించామని వివరణ ఇచ్చిన అధికారులు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్