Tuesday, April 1, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్మిల్కా సింగ్ మృతికి గవర్నర్, సిఎం సంతాపం

మిల్కా సింగ్ మృతికి గవర్నర్, సిఎం సంతాపం

ప్రముఖ అథ్లెట్, పరుగుల రారాజు, ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కాసింగ్ మృతిపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కామన్ వెల్త్ గేమ్స్ లో మన దేశానికి తొలి స్వర్ణ పతకం సంపాదించిన ఆటగాడిగా మిల్కా సింగ్ చరిత్ర సృష్టించారని గవర్నర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మెల్ బోర్న్, టోక్యో, రోమ్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో మూడు బంగారు పతకాలు సాధించారని గుర్తు చేశారు.  1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో నాల్గవ స్థానంలో నిలిచి దేశ గౌరవాన్ని, ప్రతిష్ఠను ఇనుమడింపజేశారని గవర్నర్ కొనియాడారు. క్రీడారంగంలో అయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1959 లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. మిల్కా సింగ్ ఆత్మకు శాంతి కలిగించాలని గవర్నర్ భగవంతుని ప్రార్ధించారు.

దేశంలో ఎంతోమంది యువ అథ్లెట్లకు స్పూర్తిగా నిలిచారని,  దేశ క్రీడారంగానికి అయన తెచ్చిన గుర్తింపు చిరస్మరణీయమని సిఎం జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. మిల్కా సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్