Wednesday, March 26, 2025
HomeTrending Newsరాష్ట్రపతికి ఘనస్వాగతం

రాష్ట్రపతికి ఘనస్వాగతం

Grand Welcome: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. త్రివిధ దళాధిపతి హోదాలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ సమీక్షించేందుకు విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన స్వగతం పలికారు. రాష్ట్రపతి దంపతులకు ప్రత్యేక జ్ఙాపిక ను సిఎం అందజేశారు. రేపు ఉదయం ప్రెసిడెంట్ ఫ్లీట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్, సిఎం, నావికా దళం ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయి రెడ్డి, గోద్దేటి మాధవి, ఎంవివి సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్