Thursday, February 27, 2025
HomeTrending Newsప్రధానితో గవర్నర్ భేటీ

ప్రధానితో గవర్నర్ భేటీ

రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఏపీ గవర్నర్ గా ఆయన ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఢిల్లీ వెళ్ళిన ఆయన నిన్న శనివారం రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ లతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసి జనవరి 5న పదవీ విరమణ చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కేంద్ర ప్రభుత్వం సిఫారసుతో రాష్ట్రపతి ఏపీ గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్