Tuesday, March 17, 2026
HomeTrending NewsCovid Review: బూస్టర్ డోస్ లు ఇవ్వండి: మంత్రి విజ్ఞప్తి

Covid Review: బూస్టర్ డోస్ లు ఇవ్వండి: మంత్రి విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ పూర్తిగా అదుపులో ఉందని, గత రెండువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,096 మందికి పరీక్షలు నిర్వహిస్తే, ఇందులో 267 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఇంటి వద్దే ఉంటూ వైద్య సేవలు పొందుతున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా పరీక్షల విషయంలో నిరంతరం వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు మరో 20 లక్షల బూస్టర్‌ డోసులను కేంద్రం కేటాయించాలని….ఆక్సిజన్‌ ప్లాంట్లు, పీహెచ్‌సీల నిర్వహణకు అయ్యే మొత్తాన్ని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ భరించాలని మంత్రి రజిని విజ్ఞప్తి చేశారు. మాండవీయతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి పర్వీన్‌ పవార్‌ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. మంత్రి రజినితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ నివాస్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్సుకు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular