Monday, January 20, 2025
HomeTrending Newsకోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులకు జైలుశిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులకు జైలుశిక్ష

కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో తాము ఇచ్చిన ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ ఐఏఎస్‌ బుడితి రాజశేఖర్‌, ఐఆర్‌ఎస్‌ రామకృష్ణకు నెల రోజుల జైలుశిక్షతో పాటు ₹2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీరిద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అధికారులకు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది.

మరోవైపు కోర్టుకు అధికారులు క్షమాపణ చెప్పడంతో శిక్షను బెంచ్ సవరించింది. ఈ రోజు కోర్టు సమయం పూర్తయ్యే వరకూ నిలబడే ఉండాలని ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్