Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్నరేగా బిల్లులు చెల్లించండి: హైకోర్టు

నరేగా బిల్లులు చెల్లించండి: హైకోర్టు

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది.  జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని ఆదేశించింది. చెల్లించకపోతే ఉన్నతాధికారులు కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలసి ఉంటుందని హెచ్చరించింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ధర్మాసనం నరేగా నిధులపై నేడు విచారణ విచారణ

కోర్టు ఎన్నిసార్లు సూచన ఇచ్చినా ఎందుకు అమలు చేయట్లేదని, ఎన్నిసార్లు చెప్పించుకుంటారంటూ హైకోర్ట్ ఆగ్రహంవ్యక్తం చేసింది. ఆగస్ట్ 1 లోపు చెల్లించకపోతే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నరిగా నిధులపై మూడు నెలలుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. పిటీషనర్ల తరుపున గుంటూరుకు చెందిన న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఐదు లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లులు అన్నీ చెల్లించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం అమలు చేయలేదని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఆగస్ట్ 1 నాటికి చెల్లించాలని తీర్పు చెప్పింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్