నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజును వెంటనే రమేష్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏపి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా కోర్ట్ నుంచి వచ్చిన వైద్య నివేదికను హైకోర్ట్ పరిశీలించింది. రఘురామను కొట్టినట్లుగా గాయాలు ఏవి లేవని వైద్య బృందం నివేదిక ఇచ్చింది.
సిఐడి కోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదంటూ హైకోర్టు నిలదీసింది. తక్షణమే ఆయనను జైలు నుంచి రమేష్ ఆస్పత్రికి తరలించాలని తీర్పు చెప్పింది.
రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న ఆదేశాలపై ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులున్నాయని, ఆ ఆస్పత్రికి తీసుకెళ్లడం అంటే తెలుగుదేశం ఆస్పత్రికి తీసుకెళ్ళడమేనని కోర్టుకు విన్నవించారు. అయితే దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
రఘురామ కృష్ణంరాజునుకు గుంటూరు జిజిహెచ్ తో పాటు రమేష్ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం రెండు ఆస్పత్రుల వైద్యులు ఇచ్చే నివేదికలు సమర్పించాలని నిన్న సిఐడి కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.