ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జులై 27న చేపడతామని వెల్లడించింది. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. వారం రోజుల క్రితం దీనిపై డిలే పిటిషన్ దాఖలు చేసింది.
నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరిపామని, సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించామని ఎన్నికల సంఘం పిటిషన్ లో పేర్కొంది. సింగిల్ జడ్జి ఆదేశాలు పక్కన పెట్టాలని విన్నవించింది. దీనిపై నేడు విచారణ మొదలుపెట్టిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇస్తూ విచారణను వాయిదా వేసింది. విచారణ పూర్తయ్యే వరకూ కౌంటింగ్ జరపవద్దని, ఫలితాలు వెల్లడించవద్దని సూచించింది.
నోటిఫికేషన్ విడుదలకు-పోలింగ్ తేదీకి మధ్య నాలుగువారాల సమయం కచ్చితంగా ఉండాలన్న సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది.