Saturday, January 18, 2025
HomeTrending Newsజీవో నం.2 సస్పెండ్ చేసిన హైకోర్టు

జీవో నం.2 సస్పెండ్ చేసిన హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. పంచాయితీ సర్పంచ్ లు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. ఈ జీఓను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను సస్పెండ్ చేసింది. పిటిషనర్ తరపున లాయర్ నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

ఈ జీవో వెనుక ఉద్దేశాలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర స్థాయిలో సిఎం ఎలాగో గ్రామ స్థాయిలో సర్పంచ్ అలాగేనని, గ్రామంలో సర్పంచ్ కు అన్ని అధికారాలు ఉంటాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ జీవో ద్వారా ప్రభుత్వం పంచాయతీల పాలనలో జోక్యం చేసుకోవడమేనని, పంచాయతీల స్వయం పాలనకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. స్థానిక సంస్థలకు విశేష అధికారాలిస్తూ చేసిన 73, 74 రాజ్యంగ సవరణ లక్ష్యాలను ఈ జీవో హరించి వేస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్