Data thefted: ప్రభుత్వం వద్ద ఉండాల్సిన వ్యక్తుల ప్రైవేట్ సమాచారంతో ఉద్దేశ పూర్వకంగా, కుట్ర పూరిత ఆలోచనలతో లబ్ధి పొందడానికి గత చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించిందని హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. పెగాసస్ వ్యవహారంపై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియమించిన హౌస్ కమిటీ… భూమన అధ్యక్షతన గత రెండ్రోజులుగా భేటీ అవుతోంది. నేడు సమావేశం ముగిసిన తరువాత భూమన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం సాధికార సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో తమకు ఓట్లు వేయని వారిని గుర్తించి ఆ తర్వాత సేవా మిత్ర యాప్ ద్వారా వారి ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నిందని తమ కమిటీ ఓ నిర్ధారణకు వచ్చిందని వివరించారు. 2016నుంచి 2019వరకూ ఈ వ్యవహారం జరిగిందని, ఇదంతా నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే జరిగిందని భూమన స్పష్టం చేశారు.
డేటా చౌర్యం జరిగిన మాట వాస్తవమని, ఇది ఆషామాషీ వ్యవయారం కాదని, పెద్దలు పూర్తిగా సహకరించి, కుట్ర చేసి సమాచారం దొంగిలిచారని చెప్పారు. ఈ డేటాను అప్పటి అధికార పార్టీకి అందజేసి, తద్వారా దాదాపు 30 నుండి 40 లక్షల ఓట్లను తొలగించాలని చూశారని చెప్పారు. నాటి ఐటి శాఖ అధికారి విజయానంద్, ఆర్టీజీఎస్ అధికారి అహ్మద్ బాబు, ప్రస్తుత హోం శాఖ కార్యదర్శిలను పిలిపించి మాట్లాడామన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న ఈ సమాచారం ఏ ఇతర మార్గాల ద్వారా బైటకు వెళ్ళే ప్రసక్తే లేదని వారు చెప్పారని వెల్లడించారు. మరో రెండ్రోజులపాటు సమావేశం జరిపి దీనిపై ఓ తుది నివేదికను అసెంబ్లీకి సమర్పిస్తామని భూమన చెప్పారు.
Also Read : పెగాసస్: భూమన అధ్యక్షతన హౌస్ కమిటీ