Monday, January 20, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రతి పేదవాడికి రూ. 15 లక్షల సంపద: మంత్రి శ్రీ రంగనాధ

ప్రతి పేదవాడికి రూ. 15 లక్షల సంపద: మంత్రి శ్రీ రంగనాధ

“నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు” ద్వారా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పడబోతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. రాష్ట్రంలో 13 వేల గ్రామలుంటే కొత్తగా 17 వేల కాలనీలు వస్తున్నాయన్నారు.

విజయనగరం జిల్లాలో పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి రంగనాథరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో విజయనగరం జిల్లాలో 98వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణంతో ప్రతి కుటుంబంలో ఆర్ధికవృద్ధి పెరుగుతుందన్నారు.   పార్టీలు, కులాలు, మతాలకు ఆతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో తొలివిడతలో నిర్మిస్తున్న 15 లక్షల 60 వేల ఇళ్లను మార్చి నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని మంత్రి వివరించారు. గృహ నిర్మాణంపై అన్ని జిల్లాల్లో సమీక్ష జరిపి, క్షేత్ర స్థాయి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంటి నిర్మాణం ద్వారా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి 15 లక్షల సంపద సిఎం జగన్ సృష్టించి ఇస్తున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్