Saturday, September 21, 2024
HomeTrending Newsగెజిట్‌ ను ఆహ్వానిస్తున్నాం : సజ్జల

గెజిట్‌ ను ఆహ్వానిస్తున్నాం : సజ్జల

కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. న్యాయం తమ పక్కనే ఉందని.. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తయ్యేది కాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా వదిలేశారని.. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకు గండి కొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ నేతలు దూకుడుగా వ్యవహరించినా తాము మాత్రం సంయమనం పాటించామన్నారు. సీఎం జగన్ రాజ్యాంగబద్ధంగా ఒత్తిడితెచ్చి విజయం సాధించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ఇది జగన్ విజయం: మంత్రి సీదిరి
కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వెళ్ళడం సిఎం జగన్ సాధించిన విజయమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు అభివర్ణించారు. ప్రధాని మోడికి, కేంద్ర జల్ శక్తి శాఖకు లేఖలు రాసి ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ చేసిన విద్యుత్ ఉత్పత్తుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు.  రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో సిఎం జగన్ ఎంత దూరమైనా వేల్తానారి ఈ సంఘటనలో నిరూపితమిందని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

నీటి వాటా దక్కించుకుంటాం: బాలినేని
కృష్ణా, గోదావరి జలాలపై కేంద్ర విడుదల చేసిన గెజిట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చిస్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులను దక్కించుకుంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్