Saturday, March 15, 2025
HomeTrending NewsJogi Ramesh: హైదరాబాద్ నీరా కేఫ్‌ లో జోగి

Jogi Ramesh: హైదరాబాద్ నీరా కేఫ్‌ లో జోగి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ నగరం నెక్లెస్ రోడ్డులో ప్ర‌తిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడు జోగి రాజీవ్ సందర్శించారు.

ప్ర‌కృతి సిద్ధ‌మైన, స్వ‌చ్ఛ‌మైన నీరాను ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న ఈ నీర కేఫ్ ను జోగి రమేష్ ప్రశంసించారు.

జోగి రమేష్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించి దగ్గరుండి మంత్రి జోగి రమేష్ కి ఈ నీరా కేఫ్ లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చలనచిత్ర నటుడు తల్వార్ సుమన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ప్రజా ప్రతినిధులు నాయకులు, గౌడ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్