Friday, March 13, 2026
Homeసినిమావిశ్వంభర సెట్ కు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి

విశ్వంభర సెట్ కు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నేడు హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నగర శివార్లలో జరుగుతోన్న విశ్వంభర సినిమా సెట్ కు వచ్చిన దుర్గేష్ కు చిరంజీవి సాదరంగా స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. సినీ దర్శక నిర్మాతలు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, డీవోపీ చోటా కె నాయుడు తదితరులు మంత్రిని అభినందించారు.

ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేస్తూ ” మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు!  తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను!” అంటూ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular