Wednesday, March 11, 2026
HomeTrending Newsప్రఫుల్ పటేల్ తో మేకపాటి భేటీ

ప్రఫుల్ పటేల్ తో మేకపాటి భేటీ

నవంబర్ 14, ఆదివారం తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ని చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తిరుపతిలోని గ్రాండ్ రిట్జ్ హోటల్లో సమావేశమై…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పర్యాటకాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించాలని మేకపాటి ప్రఫుల్ పటేల్ ని కోరారు. అనంతరం లక్షదీప్ కు రావాలని అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కూడా మేకపాటిని ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular