Sunday, January 19, 2025
HomeTrending NewsDr. Seediri: ఆలోచించి మాట్లాడాలి: సీదిరి ఆగ్రహం

Dr. Seediri: ఆలోచించి మాట్లాడాలి: సీదిరి ఆగ్రహం

బిఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టినంత మాత్రాన సరిపోదని, జాతీయ వాదానికి- ప్రాంతీయ ఉగ్ర వాదానికి చాలా తేడా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. తెలంగాణా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రాంతీయ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణకు  కేసిఆర్ కుటుంబ సభ్యులు నాయకులయ్యరంటూ విరుచుకుపడ్డారు.  ఏదో ఒక వంకతో ఇక్కడ అడుగు పెట్టాలని చూస్తున్నారని, ఉద్యమ సమయంలో వారు ఏం మాట్లాడారో, ఆంధ్రా బిర్యానీపై ఏం వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసన్నారు.

కేవలం ఆంధ్రుల కష్టంతో ఓ బ్రహ్మాండమైన నగరంగా మారిన హైదరాబాద్ ను ఉన్నఫళంగా వదిలిపెట్టి వచ్చామని, దీనికి తోడు ఇక్కడ చంద్రబాబు దరిద్రం ఒకటి తమను వెంటాడిందని సీదిరి విమర్శించారు. సిఎం జగన్ అధికారం చేపట్టిన తరువాత విద్య, వైద్యం,వ్యవసాయ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. మాట్లాడేముందు జాగ్రత్తగా ఆలోచింఛి మాట్లాడాలని హెచ్చరించారు.  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని తాము ఎప్పటినుంచో అడుగుతున్నామని, చేతనైతే వారూ తమతో కలిసి రావాలని, అంతే కానీ బిడ్ లో పాల్గొంటామని చెప్పడం కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించినట్లు కాదా అని ప్రశ్నించారు.  తెలంగాణా వచ్చింది మీ కుటుంబానికి గులాం గిరీ చేయడానికా అంటూ నిలదీశారు. హరీష్ రావు మాటలు కల్లు తాగిన కోతి చందంగా ఉన్నాయన్నారు. ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో నాడు-నేడు ఎలా అమలు చేస్తున్నామో తెలుసుకునేందుకు ఇటీవలే తెలంగాణ అధికారుల బృందం ఇక్కడకు వచ్చిన విషయం తెలుసుకోవాలని, లేకపోతె మీ మామ కెసిఆర్ ను అడగాలని సూచించారు. పనికిమాలిన మాటలు మాట్లాడడం మానుకోవాలని, ఏపీ వారు అక్కడకు రావడం మానేస్తే తెలంగాణాలో అడుక్కు తినడం తప్ప ఏమీ ఉండదని పరుష పదజాలంతో అప్పలరాజు  ధ్వజమెత్తారు.

ఆరోగ్య శ్రీ అక్కడ అమలు చేయకపోతే ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని, ఎంజిఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలు ఉన్నాయని, ముందు వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్