ఎన్నికల్లో సీట్ల కేటాయింపు నుంచి పదవుల పంపిణీ వరకూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు సమ న్యాయం చేశారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖమంత్రి అప్పలరాజు అన్నారు. దేశంలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని అక్కున చేర్చుకుని, పక్కన కూర్చోపెట్టుకుని, అధికారాన్ని పంచి ఇచ్చిన ఘనత సిఎం జగన్ కే దక్కుతుందన్నారు.
- ఇంతకాలం రాజ్యాధికారానికి, రాజకీయ ప్రాతినిధ్యానికి దూరంగా ఉండి, వెనకబడిపోయిన అణగారిన వర్గాలకు అధికారం కల్పించారు.
- సామాజిక న్యాయం సాధన దిశగా సీఎం జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
- నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించారు.
- స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ వరకు బీసీలకు అగ్ర స్థానం కల్పించడం ద్వారా అన్నివర్గాలకు ముఖ్యమంత్రి న్యాయం చేశారు.
- ఇన్నాళ్లకు మా కల నెరవేరింది. వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారంలో వాటా దక్కిందని భావన మాకు కలుగుతుంది.