Sunday, January 19, 2025
HomeTrending Newsటాప్-3లో ఆంధ్ర ప్రదేశ్

టాప్-3లో ఆంధ్ర ప్రదేశ్

స్థిర ఆర్ధికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించింది. ­2020-21  సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులు నీతి ఆయోగ్ విడుదల చేసింది. అనేక అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ మంచి పనితీరు కనబరిచిందని ప్రశంసించింది. క్లీన్ ఎనర్జీ విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

75పాయింట్లతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు 74 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి­.  72 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్ మూడో స్థానంలోను, 71 పాయింట్లతో సిక్కిం నాలుగో స్థానంలో నిలిచాయి.   మహారాష్ట్ర 70 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది.  69 పాయింట్లతో తెలంగాణా ఆరోస్థానంలో, 52 పాయింట్లు మాత్రమే సాధించి బీహార్ చివరిస్థానంలో నిలిచాయి.

గత ఏడాది కంటే 5 పాయింట్లు ఎక్కువగా సాధించి టాప్- 5 లో స్థానం సంపాదించుకోవడం విశేషం.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్