దేశంలో కరోనా కేసులు తగ్గినా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం మాత్రం తగ్గడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై రౌడీ షీట్ పెట్టడం, బైండోవర్ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. అక్రమ కేసులు, రౌడీ షీట్లకు భయపడే నాయకులు తమ పార్టీలో ఎవరూ లేరని చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్సిపి పాలనలో రాజ్యాంగం, చట్టం దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు.
ప్రస్తుతం అమలవుతున్న రాజారెడ్డి రాజ్యాంగానికి ఇంకా మూడేళ్ళే గడువు ఉందని, అధికారం ఉందని అడ్డగోలుగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో తగిన మూల్యం మూడింతలు చెల్లించుకోక తప్పదని బాబు హెచ్చరించారు. అచ్చెన్నాయుడు కుటుంబీకుల పై వెంటనే రౌడీషీట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.