Saturday, January 18, 2025
Homeసినిమా'కల్కి' టికెట్ ధరల పెంపుకు ఏపీ గ్రీన్ సిగ్నల్

‘కల్కి’ టికెట్ ధరల పెంపుకు ఏపీ గ్రీన్ సిగ్నల్

ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’  ఈనెల 27న విడుదల కానుంది. ఈ సినిమాకు మొదటి ఎనిమిది రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు, రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు గత వారమే తెలంగాణా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే.  ఏపీ ప్రభుత్వం కూడా ఇదే వెసులుబాటు కల్పిస్తూ నేడు జీవో జారీ చేసింది. ఏపీలో రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించారు.  నిర్మాత అశ్వనీదత్ విజ్ఞప్తిని పరిగణన లోకి తీసుకొని ఈ అనుమతి ఇచ్చినట్లు హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా పేరిట విడుదలైన జీవోలో పేర్కొన్నారు.

కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్ పై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ ల్లో రూ.125 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షో ల కోసం ఒక్కో టికెట్ కు రూ. 200 వసూలు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఏపీ ఇచ్చిన జీవోలో బెనిఫిట్ షో అంశం ప్రస్తావించలేదు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల  ప్రభాస్ మాట్లాడుతూ బాహుబలి తర్వాత మళ్ళీ కామెడీ ఈ సినిమాలోనే చేస్తున్నానన్నారు. ’అలాగే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ నా కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్‘ అని తెలిపాడు. దీంతో ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్