Saturday, November 23, 2024
HomeTrending News‘ట్విట్టర్’కు ఏపీ పోలీసు శాఖ నోటీసులు?

‘ట్విట్టర్’కు ఏపీ పోలీసు శాఖ నోటీసులు?

సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్’పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేసు నమోదు కానుంది. కొందరు వ్యక్తులు రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ పేరిట మూడు నకిలీ అక్కౌంట్లు ట్విట్టర్ లో ప్రారంభించారు. వీరి వివరాలు వెల్లడించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ట్విట్టర్ ను కోరింది.

ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు వెల్లడించలేమంటూ ట్విట్టర్ జవాబు ఇచ్చింది, మూడుసార్లు పోలీసు శాఖ మెయిల్స్ పంపినా సరైన స్పందన ఇవ్వలేదు. గౌతమ్ సావాంగ్ ఫోటో తోనే ఆ వ్యక్తులు ఖాతాలు ఓపెన్ చేయడం గమనార్హం పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేసిన తరువాత ఆ అక్కౌంట్లలోని డిజిపి ఫోటోలు మాత్రం ట్విట్టర్ తొలగించింది. ఐపి అడ్రస్, ఇతర వ్యక్తిగత వివరాలు ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసు విభాగం రేపో మాపో ట్విట్టర్ కు నోటీసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ఐటి చట్టాల ప్రకారం దర్యాప్తు విభాగం, పరిశోధనా సంస్థలు తమకు కావాల్సిన సమాచారం కోరినప్పుడు సోషల్ మీడియా వేదికలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇదే విషయమై గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్ యాజమాన్యానికి మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. వివిధ కేసుల్లో దేశవ్యాప్తంగా పలు చోట్ల ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.

కొత్త ఐటి చట్టాలను నిశితంగా పరిశీలిస్తున్న ఎపి అధికారులు దానికి లోబడి ట్విట్టర్ కు నోటీసులు ఇవ్వనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్