ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా విద్యార్థుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపేం దుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేసింది నేటి (ఆగస్ట్ 1) నుంచి 15 వరకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆగస్టు 1 నుంచి 15 వరకూ రోజు వారీ కార్యక్రమాలను అమలు చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు
13 నుంచి 15 వరకూ ప్రతి ఇంటి పైనా జాతీయ పతాకం రెపరెప లాడే విధంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. గతంలో ఫ్లాగ్ కోడ్ లో ఉన్న నిబంధనలను సవరించి మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగిరేందుకు అవకాశం కల్పించింది.
13 నుంచి 15 వరకూ మూడు రోజుల పాటు ప్రతి రోజు ఉదయం దేశభక్తి గేయాలతో జాతీయ పతాకాలను చేతబట్టి నగర సంకీర్తన చేస్తూ గ్రామంలో పర్యటించనున్నారు . ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామ కూడళ్ళలో వినిపించనున్నారు.