Saturday, March 1, 2025
HomeTrending NewsAP Elections: వెంకట్రామిరెడ్డిపై వేటు

AP Elections: వెంకట్రామిరెడ్డిపై వేటు

రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను విధులనుంచి తొలగిస్తూ హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా వెంకట్రామిరెడ్డి పని చేస్తున్నారు.

వెంకట్రామిరెడ్డి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కోడ్‌కు ముందు,  తరువాత  అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేపట్టిన ఈసీ ఆయనపై వేటు వేసింది. కడప జిల్లాలో మార్చి 31న ప్రజారవాణా శాఖ (పీటీడీ) వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య,  ఇతర ఉద్యోగులతో కలిసి వైఎస్సార్‌సీపీకి ఓట్లు  వేయాలంటూ కరపత్రాలు పంచారని ఓ దినపత్రికలో వార్త కూడా ప్రచురితమైంది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రధానాదికారికి, వైఎస్సార్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

దీనితో ఆయన్ను విధులనుంచి తప్పించాలని ఎన్నికలు పూర్హయ్యే వరకూ ఎలాంటి బాధ్యతలూ అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్