Saturday, February 22, 2025
HomeTrending NewsHytt Place: టూరిజంలో పెట్టుబడులకు ప్రోత్సాహం: సిఎం

Hytt Place: టూరిజంలో పెట్టుబడులకు ప్రోత్సాహం: సిఎం

వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో  ఆంధ్ర ప్రదేశ్ ను నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం బెస్ట్ టూరిజం పాలసీని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చే ప్రతి సంస్థకు చేయూతనిచ్చి ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనిహామీ ఇచ్చారు. విజయవాడ గుణదలలోని ఈ ఎస్ ఐ బస్ స్టాప్ వద్ద నూతనంగా నిర్మించిన హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను ముఖ్యమంత్రి నేడు  ప్రారంభించారు. విజయవాడలోనే కాకుండా ఆంధ్రరాష్ట్రమంతా ఇలాంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్‌, ప్రముఖ హోటల్స్‌ రావాలని అన్నారు.

“ఒబెరాయ్‌తో మొదలుకుని ఇవాళ ప్రారంభం చేసుకుంటున్న హయత్‌ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా మరో నలుగురికి స్ఫూర్తినివ్వాలని, మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వారందరికీ ఇలాంటి ప్రోత్సహకాలిచ్చి ఏపీని వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో పెట్టేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అంటూ భరోసా ఇచ్చారు.

హయత్‌ ఛైర్మన్‌ వీరస్వామి, హయత్‌ ఇంటర్నేషనల్‌ ఏరియా ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ , మేనేజింగ్ డైరెక్టర్‌ సాయికార్తీక్‌కు, ఈ ప్రాజెక్టులో మమేకమైన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  హోంశాఖమంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, హోటల్‌ హయత్‌ ప్లేస్‌ ఛైర్మన్‌ ఆర్ వీరా స్వామి, ఉన్నతాధికారులు, పలువులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్