Monday, February 24, 2025
HomeTrending NewsYuva Galam: చర్చకు నేను సిద్ధం: అనిల్ సవాల్ కు లోకేష్ సై

Yuva Galam: చర్చకు నేను సిద్ధం: అనిల్ సవాల్ కు లోకేష్ సై

సిఎం జగన్ కు బిసిలంటే చిన్న చూపు అని, అందుకే రేపల్లెలో హత్యకు గురైన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పలకరించలేదని  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.  రాష్ట్రాన్ని పాత బీహార్ లాగా మారుస్తున్నారని, గంటకో హత్య… పూటకో రేప్, కిడ్నాప్ లు జరుగుతున్నాయని, గత వారం అమర్నాథ్ గౌడ్అ నే యువకుడిని పాశావికంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్నాథ్కు టుంబాన్ని పరామర్శించడానికి తీరికలేని సిఎం జగన్ కు రాంగోపాల్ వర్మ సినిమా స్క్రిప్టు ను పరిశీలించడానికి తీరిక ఉంటుందని విమర్శించారు. బిసిలకు అండగా ఉండేందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బిసిలను వేధించే వారిని శిక్షేందుకు సరికొత్త చట్టం తీసుకువస్తామని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అమర్నాథ్ హత్యకు కారకులైన వారిని రోడ్డుమీద తరిమి తరిమి కొట్టుకుంటూ తీసుకెళ్ళి శిక్షిస్తామని హెచ్చరించారు. యువ గళం పాదయాత్ర సందర్భంగా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు.

నెల్లూరు జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే అనిల్ చర్చకు రావాలని లోకేష్ ప్రతి సవాల్ విసిరారు. ‘ఆయనకు పని తక్కువ డైలాగులు ఎక్కువ అని, ఈ సిల్లీ బచ్చా నాకు సవాల్ విసురుడుతాడంట’ అని మండిపడ్డారు. నాయుడుపేటలో షుగర్ ఫ్యాక్టరీ పక్కన ఆయన కొనుక్కున్న వంద ఎకరాల స్థలంలో చర్చకు  రెడీ అంటూ ప్రకటించారు. అవసరమైతే జగన్ ను కూడా తీసుకురావాలన్నారు. నెల్లూరు సిటీ టికెట్ నీకు ఇస్తాడని జగన్ తో చెప్పించాలని ఛాలెంజ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్