Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్బీమా పథకం గోరంత...

బీమా పథకం గోరంత…

వైఎస్సార్ బీమా పథకంలో గోరంత ఇచ్చి కొండంత ఇచ్చినట్లు మోసం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ రెండేళ్లలో 1.18 కోట్ల మందికే బీమా ప్రీమియం చెల్లించారని, వీరిలోనూ 6౦ లక్షల మందినే బ్యాంకులకు లింక్ చేశారని, మిగతా 58 లక్షల మందిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. 2019 జూన్ నుంచి 2020 అక్టోబర్ వరకూ ఈ పథకం అమలు కాలేదని చెప్పారు.

తమ ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా ద్వారా 2 కోట్ల 47 లక్షల మందికి లబ్ధి చేకూర్చామని, ఇప్పుడు కూడా వారందరికీ ఈ బీమా సౌకర్యం కల్పించారని డిమాండ్ చేశారు. బీమా సొమ్మును 5 నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాలని, 18 నుంచి 50  ఏళ్ళ మధ్య వయసున్న వ్యక్తి సహజంగా మరణిస్తే లక్ష రూపాయలు ఇస్తున్నారని, దాన్ని 2 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ ఏడాది ప్రభుత్వం 1.32 కోట్ల మందికి బీమా ఇస్తామని చెబుతోందని, అయినా తాము ఇచిన 2.47 కోట్ల మందిలో కోటి 15 లక్షల మందికి అన్యాయం చేస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్