Tuesday, January 21, 2025
Homeసినిమాఅందంగా మెరిసిన ఈ అపర్ణ జనార్ధన్ ఎవరు? 

అందంగా మెరిసిన ఈ అపర్ణ జనార్ధన్ ఎవరు? 

టాలీవుడ్ కి ఎప్పటికప్పుడు అందమైన కథానాయికలు దిగిపోతుంటారు. ఇక్కడ ఎవరి అదృష్టాన్ని వారు పరీక్షించుకుంటూ ఉంటారు. కాస్త అందం .. మరికాస్త అభినయం ఉంటే చాలు, కుర్రాళ్లంతా అభిమాన గణంలో చేరిపోతుంటారు. ఈ ఏడాదిలోని 6 నెలలలో చాలామంది కథానాయికలు తెలుగు తెరకి పరిచయమయ్యారు. వాళ్లలో గ్లామర్ పరంగా .. నటన పరంగా కాస్త ఆకట్టుకున్నవారిగా అతుల్య రవి .. ఆషిక రంగనాథ్ .. అనిక సురేంద్రన్ కనిపిస్తారు.

అయితే తెలుగులో ఈ ముగ్గురి మొదటి సినిమాలు పరాజయంపాలు కావడం వలన, వాళ్లను గురించిన చర్చలేం జరగలేదు. వాళ్లు మాత్రం సరైన ఛాన్స్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ లోగానే మరికొంతమంది కథానాయికలు రంగంలోకి దిగిపోతున్నారు. ఆ జాబితాలో కొత్తగా వినిపిస్తున్న పేరు ‘అపర్ణ జనార్దన్’. ‘లవ్ యూ రామ్’ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయమవుతోంది. దర్శకుడు దశరథ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

ఈ సినిమాతో డి. వై. చౌదరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నిన్ననే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ వదిలారు. ప్రేమ – పెళ్లి .. ఈ మధ్యలోని కొన్ని ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుందని అనిపిస్తోంది. అపర్ణ చాలా క్యూట్ గా కనిపించింది. ఈ కేరళ బ్యూటీ రీసెంట్ గానే మలయాళంలో తన కెరియర్ ను మొదలుపెట్టింది. చాలామందికి మాదిరిగానే మోడలింగ్ వైపు నుంచి వచ్చింది. ఆమె నటించిన ‘లవ్ యూ రామ్’ ఈ నెల 30న థియేటర్స్ కి రానుంది. ఈ సినిమాతో అపర్ణ ఇక్కడ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్