Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప 2'లో జాతరను మించిన సీన్ మరొకటి ఉందట!

‘పుష్ప 2’లో జాతరను మించిన సీన్ మరొకటి ఉందట!

‘పుష్ప’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కథాకథనాల పరంగా .. బన్నీ లుక్ .. ఆయన మేనరిజం పరంగా ఈ సినిమా జనంలోకి దూసుకుపోయింది. పాటల పరంగా కూడా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. బన్నీ కెరియర్లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది .. ఆయనను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టేసింది. అందువలన ‘పుష్ప 2’ కోసం అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్టు టీమ్ ముందుగానే చెప్పింది. అందుకు తగినట్టుగానే చకచకా పనులను పూర్తిచేసుకుంటూ ఆ దిశగా ముందుకు వెళుతోంది.  ఈ సినిమా నుంచి వదులుతున్న అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతూ వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు మరింత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాంతో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘జాతర’ ఎపిసోడ్ హైలెట్ అనేదే ఇప్పటి వరకూ వినిపిస్తూ వచ్చిన మాట. కానీ ఊపిరి బిగబట్టి చూసే మరో ఎపిసోడ్ కూడా ఉందనే టాక్ మొదలైంది. అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటి ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. తెలుగు సినిమాల్లో ఇంతవరకూ లేని అండర్ వాటర్ ఫైట్ ఈ సినిమాలో ఉండనుందని అంటున్నారు. విడుదల తరువాత చాలా రోజుల పాటు ఈ సీన్ గురించి మాట్లాడుకుంటారని చెబుతున్నారు. చూడాలి మరి ఆ సీన్ ఎలా ఉంటుందో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్