Saturday, November 23, 2024
HomeTrending Newsకేంద్రం సహకారం లేదు - ఎమ్మెల్సీ కవిత

కేంద్రం సహకారం లేదు – ఎమ్మెల్సీ కవిత

అనేక రాష్ట్రాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, మన రాష్ట్రంలో జీతాలు సమయానికి ఇవ్వడమే కాకుండా, పీఆర్సీ పెట్టి ఉద్యోగుల జీతాలు పెంచుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పారదర్శకమైన, ప్రగతిశీలమైన, ప్రతిభావంతమైన సీఎం కేసీఆర్ వల్లనే జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం ‌లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత ఈ రోజు శాసనమండలిలో మాట్లాడుతూ వివిధ అంశాల్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో  కొత్త పాలసీలు తెచ్చి, అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ , కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సహకారం రావడం లేదని, రాష్ట్రానికి పన్నుల్లో రావాల్సిన వాటా, ఠంచనుగా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నదా లేదా వెల్లడించాలని, ఫైనాన్స్ కమీషన్ నుండి రావాల్సిన సహకారం లభిస్తున్నదా లేదా అని ప్రభుత్వాన్ని అడిగారు.

జీఎస్టీ నుండి ‌మనకు రావాల్సిన వాటపై, గతంలో పార్లమెంటు లోనూ రెగ్యులర్ గా ప్రతి ఏడాది గుర్తు చేసినా, ఎప్పుడూ పెండింగ్‌లో ఉండేవని, ఇవి రాకపోవడం వల్ల మన రాష్ట్రం పురోగతికి కలుగుతున్న ఆటంకాల గురించి వివరించాల్సిందిగా ఆర్థిక మంత్రి హరీష్ రావును కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్