Sunday, January 19, 2025
Homeసినిమా13న వస్తున్న ‘అరకులో విరాగో’

13న వస్తున్న ‘అరకులో విరాగో’

‘విరాగో’ అంటే సంస్కృతంలో ‘మహిళా యోధురాలు’ అని అర్ధం.  అరకు ప్రాంతానికి చెందిన ఓ యువతి… తన అక్కకు జరిగిన అన్యాయంపై చేసే పోరాటం నేపధ్యంలో రూపొందిన చిత్రానికి “అరకులో విరాగో” అనే పేరు పెట్టారు దర్శక నిర్మాతలు. దర్శకుడు గిరి చిన్నాకి, నిర్మాత శ్రీమతి తోట సువర్ణకి ఇది ఆరంగేట్ర చిత్రం కావడం గమనార్హం. తోట ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నఈ విభిన్న కథా చిత్రంలో రవీన్ ప్రగడ-పూజా చౌరాసియా హీరో హీరోయిన్లు. డి.ఎస్.రావు ప్రతినాయకుడు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాత శ్రీమతి తోట సువర్ణ మాట్లాడుతూ… “గిరి చిన్నా చెప్పిన కథ ఎంతగానో నచ్చి… అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ… నిర్మాతగా నేను కూడా అరంగేట్రం చేస్తున్నాను. తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీసుల్ని ఆశ్రయించిన తనకు అక్కడ కూడా ఎదురైన ఆరాచకంపై ఓ ధీర వనిత తీర్చుకునే ప్రతీకారమే “అరకులో విరాగో”. హీరో-హీరోయిన్లుగా పరిచయమవుతున్న రవీన్ ప్రగడ-పూజా చౌరాసియా… ఇద్దరూ చక్కని ప్రతిభ కనబరిచారు. డి.ఎస్.రావు విలన్ గా అద్భుతంగా నటించారు. ఈనెల 13న విడుదల చేస్తున్నాం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్