Saturday, January 18, 2025
Homeసినిమాహాట్ స్టార్ కి వచ్చేసిన హారర్ కామెడీ 'బాక్'

హాట్ స్టార్ కి వచ్చేసిన హారర్ కామెడీ ‘బాక్’

తమిళంలో హారర్ కామెడీ సినిమాలు చేయడంలో సుందర్ సి.కి మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి వస్తున్న ‘అరణ్మణై’ సిరీస్ ఎప్పటికప్పుడు మంచి సక్సెస్ ను అందుకుంటూ వెళుతోంది. మొదటి రెండు భాగాలు తెలుగులోను భారీ వసూళ్లను రాబట్టాయి. మూడో భాగం మాత్రం ఇక్కడ ఒక మోస్తరుగా ఆడింది. ఈ నేపథ్యంలో సుందర్ ‘అరణ్మణై 4’ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. మే 3వ తేదీన ఈ సినిమా అక్కడ విడుదలైంది.

ఇదే సినిమాను అదే రోజున తెలుగులో ‘బాక్’ పేరుతో విడుదల చేశారు. తమన్నా .. రాశిఖన్నా .. సుందర్ సి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అక్కడ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు హాట్ స్టార్ లోకి అడుగుపెట్టింది. ఈ రోజు నుంచే ఈ సినిమా ఈ ఫ్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతోంది. సుందర్ సి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, అక్కడ ఆయనకి  మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ – శ్రీనివాస రెడ్డి ముఖ్యమైన పాత్రలను చేయడం విశేషం.

కథగా చూసుకుంటే .. ఇది అన్నాచెల్లెళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. కులాంతర వివాహం చేసుకుని ఇల్లొదిలి వెళ్లిపోయిన శివశంకర్ చెల్లెలు, వేరే ఊళ్లో కాపురం పెడుతుంది. ఆ దంపతులు అనుమానాస్పద స్థితిలో చనిపోతారు ..పిల్లలు అనాథలవుతారు. ఈ విషయం తెలిసిన వెంటనే శివశంకర్ అక్కడికి వెళతాడు. జరిగిన సంఘటనకు ‘బాక్’ అనే ఒక దెయ్యం కారణమని అతనికి తెలుస్తుంది. అప్పుడతను ఏం చేస్తాడనేదే కథ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్