Tuesday, March 10, 2026
HomeTrending Newsరాజశ్యామల సహస్ర చండీయాగం: జగన్ కు వేద ఆశీర్వచనం

రాజశ్యామల సహస్ర చండీయాగం: జగన్ కు వేద ఆశీర్వచనం

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభం జరగాలంటూ గత 41 రోజులుగా జరుగుతోన్న శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నేడు పూర్ణాహుతితో ముగిసింది.

తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో ఈ సహస్ర చండీయాగం నిర్వహించారు.

ఈ యాగం పూర్తయిన సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలుసుకుని  తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular